బ్రేకింగ్: హైకోర్టు తీర్పు పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏమన్నారో తెలుసా?

Friday, May 29th, 2020, 01:35:56 PM IST


నిమ్మగడ్డ రమేష్ కుమార్ నీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ సంచలన ప్రకటన చేసింది. అయితే జగన్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్సు ను కొట్టి పారేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు పై నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. హైకోర్టు చేసిన సూచనలతో విధుల్లో చేరుతాను అని వ్యాఖ్యానించారు. నా విధులను నిస్పక్ష పాతం గా నిర్వహించాను అని మరొకసారి అన్నారు.అయితే అందరి సంప్రదింపుల తోనే ఈ సారి స్థానిక ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తాం అని వ్యాఖ్యానించారు.వ్యక్తులు శాశ్వతం కాదు, రాజ్యాంగ వ్యవస్థలే శాశ్వతం అని అన్నారు.

అయితే మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పై సుప్రీం కోర్టు ను అశ్రయించేందుకు సిద్దంగా ఉంది. హైకోర్టు తీర్పు కాపి అందిన అనంతరం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ తీర్పు ను ముందుగానే ఊహించినట్టు తెలుస్తోంది. అయితే సీనియర్ లాయర్ లతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. అంతేకాక ప్రతికూలంగా తీర్పు వస్తుంది అని ముందే భావించాం అని ప్రభుత్వం అధికారులు చెబుతున్నారు.