ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయం లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. షెడ్యూల్ ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఎన్నికల నిర్వహణ కి ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ను కలవనున్నారు. ఉదయం 11:30 గంటల సమయం లో కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, సింగిల్ బెంచ్ ఉత్తర్వులు, డివిజన్ బెంచ్ కి అప్పీల్ పై గవర్నర్ కి విషయాలను వెల్లడించే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల పై అప్పీల్ దాఖలు చేసింది. అయితే ఈ హౌస్ మోషన్ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలి అని ఎస్ ఈ సి తరపు న్యాయ వాది అభ్యర్డించడం జరిగింది. అయితే ఈ పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించడం జరిగింది. అయితే దీని పై పూర్తి స్థాయిలో చర్చ జరిపేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ను కలవనున్నారు.