బిగ్ న్యూస్: ఏపీ ఎన్నికల కమీషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ..!

Friday, May 29th, 2020, 11:36:04 PM IST

ఏపీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల కమీషనర్ పదవీకాలాన్ని తగ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు కొట్టివేయడంతో పదవి బాధ్యతలు స్వీకరిస్తూ ఎన్నికల కమీషనర్ ప్రకటన విడుదలైంది.

అయితే ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో రెండు రోజుల్లో విజయవాడ బయలుదేరనున్నారు. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగించిన తర్వాత ఏపీ ఎస్‌ఈసీ కార్యాలయానికి జీఏడీ సీల్‌ వేసింది. అయితే హైకోర్ట్ ఇచ్చిన తీర్పుతో సోమవారం నాడు తీరిగి ఎస్‌ఈసీ కార్యాలయం తెరుచుకోబోతుంది.