పుత్ర‌ర‌త్నంపై నిర్భ‌య కేసు?

Thursday, April 12th, 2018, 09:54:30 PM IST

శ్రీ‌రెడ్డి గొడ‌వ అంత‌కంత‌కు ర‌చ్చ‌వుతోంది. మా ఆఫీస్ ముందు తాను బ‌ట్ట‌లు ఇప్పింద‌ని అంతా భావిస్తే, `మా` వాళ్ల‌కే బ‌ట్ట‌లిప్పించేస్తోంది. ఈరోజు సాయంత్రం శ్రీ‌రెడ్డి డిమాండ్స్‌కి త‌లొగ్గి `మా అసోసియేష‌న్‌` మెంబ‌ర్‌షిప్ ఇచ్చేందుకే సిద్ధ‌మ‌వ్వ‌డం హాట్ టాపిక్ అయ్యింది. అదంతా అటుంచితే శ్రీ‌రెడ్డికి అంత‌కంత‌కు మ‌ద్ధ‌తు పెరుగుతోంది. నేటి సాయంత్రం ఏకంగా స్టూడెంట్ జేఏసీ ఫిలింఛాంబ‌ర్ ముందు ధ‌ర్నా చేప‌ట్టి, ఈ కేసులో బ‌య‌టికి వ‌చ్చిన ప్ర‌ముఖులంద‌రినీ శంక‌ర‌మాన్యాలు ప‌ట్టిస్తామ‌ని శ‌ప‌థం చేశారు.

తొలిగా అగ్ర‌నిర్మాత డి.సురేష్‌బాబు త‌న‌యుడు అభిరామ్‌పై నిర్భ‌య కేసు పెట్టేందుకు విద్యార్థి సంఘాలు రెడీ అవుతున్నాయి. రేప‌టి ఉద‌యం పోలీస్ స్టేష‌న్‌కి వెళుతున్నారు. ప‌నిలో ప‌నిగా నాని, కోన‌, కొర‌టాల‌పైనా కేసులు న‌మోదు చేస్తార‌ట‌. ఈ ర‌చ్చ అంతా చూస్తుంటే మామూలుగా లేదు. ఒక‌ప్ప‌టి చింతామ‌ణికి, ఇప్ప‌టి శ్రీ‌రెడ్డికి మ‌ధ్య ఉన్న డిఫ‌రెన్స్ ఏంటో తెలీక సామాన్య జ‌నం మాత్రం బుర్ర‌లు గోక్కుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments