నిర్భయ హత్యోదంతం : మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నిందితులు

Saturday, January 25th, 2020, 02:00:01 AM IST

మన దేశాన్నే అతలాకుతం చేసినటువంటి అతి దారుణమైన ఘటన నిర్భయ హత్యోదంతం… కాగా మరికొద్ది రోజుల్లో ఈ నలుగురు నిందితులకు ఉరి శిక్ష అమలు కానున్న సంగతి మనందరికీ తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో నిర్భయ దోషులు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాగా ఆ నలుగురు నిందితులు కూడా క్యూరేటివ్‌ పిటిషన్లు దాఖలు చేయడానికని అవసరమైన పత్రాలను ఇవ్వడంలో తీహార్ జైలు అధికారులు కావాలనే ఆలస్యం చేస్తున్నారని, ఆ నిర్భయ హత్యోదంతానికి కారణమైన నలుగురు దోషుల్లో ఇద్దరైనా అక్షరు కుమార్‌ సింగ్‌, పవన్‌ సింగ్‌లు మళ్ళీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

అయితే దీనికి సంబంధించి ఎపి సింగ్‌ శుక్రవారం ఢిల్లీ పటియాలా హౌస్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా ఈ విచారణను శనివారం నాడు జరపనున్నారని సంచారం. అయితే ఇంతకు ముందు కూడా వినరు కుమార్‌ శర్మ, ముఖేష్‌ సింగ్‌ అనే ఇద్దరు నిందితులు దాఖలు చేసుకున్న క్యూరేటివ్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే ఫిబ్రవరి 1 వ తేదీన వీరికి ఉరి శిక్ష ఖరారు కానున్న నేపథ్యంలో ఇలాంటి పిటిషన్ లు రావడం అనేది చర్చనీయయాంశంగా మారింది. అయితే ఈ పిటిషన్ ని కూడా న్యాయస్థానం కొట్టేస్తుందని, ఆ నలుగురు మృగాలకు తప్పకుండ ఉరిశిక్ష పడుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.