కాటమరాయుడుకి ఫ్యాన్సీ అఫర్ ఇచ్చిన యువ హీరో ?

Saturday, February 11th, 2017, 11:55:46 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ”కాటమరాయుడు” ట్రైలర్ విడుదల తరువాత సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. అంతకు ముందు అంతగా హైప్ లేని ఈ సినిమా సత్తా ఏమిటో ట్రైలర్ చూపించింది. మార్చ్ 28 న విడుదలకు సిద్దమవుతున్న కాటమరాయుడు సినిమాకు బిజినెస్ వార్తల్లో భారీ క్రేజ్ నెలకొంది, ఇప్పటికే ఈ సినిమా ఏరియా హక్కులకోసం గట్టి పోటీ నెలకొంది, ఇప్పటికే పలువురు భారీ రేట్ ఆఫర్స్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నైజం హక్కుల కోసం యువ హీరో నితిన్ భారీ అఫర్ ని ఇచ్చాడట !! నితిన్, పవర్ స్టార్ కు ఎంత పెద్ద ఫ్యాన్ అన్న విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. తన అభిమాన హీరో సినిమాను నైజాం లో విడుదల చేయడానికి ఓ ఫ్యాన్సీ రేటు ను అఫర్ చేసాడట!! కిషోర్ కుమార్ పార్థసాని (డాలి ) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. పవన్ సరసన గ్లామర్ భామ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలోని పాటలు త్వరలోనే విడుదల కానున్నాయి. మరి ఈ సినిమా హక్కులు నితిన్ కి దక్కుతాయో లేదో చూడాలి !!