చల్ మోహన రంగ టీజర్ : నితిన్ లవ్ కి కౌంటర్

Wednesday, February 14th, 2018, 10:23:27 AM IST

లై సినిమాతో ఊహించని విధంగా అపజయాన్ని అందుకున్న నితిన్ నెక్స్ట్ ఎలాగైనా హిట్టు కొట్టాలని చాలా కసిగా ఉన్నాడు. అయితే కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ చేసిన చల్ మోహన రంగ అనే సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ఇప్పటి నుంచే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయాలనీ డిసైడ్ అయ్యింది. ఒక మంచి లవ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న సినిమా కాబట్టి లవర్స్ డే సందర్బంగా చిత్ర యూనిట్ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది.

వర్షా కాలంలో కలుసుకున్న మేము.. శీతాకాలంలో ప్రేమించుకొని.. వేసవి కాలంలో విడిపోయాం..అని హీరో నితిన్ చెప్పడం ఆ డైలాగ్ కి కౌంటర్ గా.. మీరిద్దరు వెదర్ రిపోర్టర్సా బయ్యా అని చెప్పడం చాలా బావుంది. టీజర్ కి ప్రస్తుతం పాజిటివ్ టాక్ బాగానే అందుతోంది. మరి ముందు కూడా ఇదే తరహాలో చిత్ర యూనిట్ సినిమాపై అంచనాలను పెంచుతుందో లేదో చూడాలి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ తో కలిసి శ్రేష్ట్ మూవీస్ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.