కళ్యాణ్ గారు మీరు సినిమా చేయను అని అనకండి: నితిన్

Sunday, March 25th, 2018, 10:58:42 PM IST

పవన్ కళ్యాణ్ అంటే నితిన్ కు ఎంత ప్రత్యేకమో అందరికి తెలిసిందే. ఆయన ప్రతి సినిమాలో ఎదో విధంగా పవర్ స్టార్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఫైనల్ గా ఇప్పుడు పవన్ ప్రొడక్షన్ లోనే నితిన్ సినిమా చేసే అదృష్టాన్ని సంపాదించుకున్నాడు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఆ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇక రీసెంట్ గా సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చిత్ర యూనిట్ గ్రాండ్ గా జరుపుకుంది. ట్రైలర్ ని పవన్ అందరి సమక్షంలో లంచ్ చేశారు.

అయితే అంతకుముందు వేడుకలో మాట్లాడిన నితిన్ పవన్ అభిమానుల తరపున నుంచి ఒక కోరికను కోరాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సినిమాలను ఆపకూడదని ఒకవేళ అలాంటి ఆలోచన ఉన్నా కూడా బయటకు చెప్పకండి. సినిమా వస్తుంది అనే ఆలోచనతో నమ్మకంగా ఉంటామని నితిన్ చెప్పాడు. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమా చేయను అని అనకండి అంటూ నితిన్ గట్టిగా చెప్పడంతో అభిమానులు నుంచి కూడా పెద్ద సౌండ్ తో రెస్పాన్స్ వచ్చింది.