రెమ్యూనరేష్ పెంచేసిన .. నితిన్ ?

Saturday, January 28th, 2017, 10:21:37 AM IST

NITIN
క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ”అ ఆ” సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న నితిన్ ఆ సినిమాతో ఏకంగా యాభై కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ సినిమా తరువాత మంచి సినిమాలు చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో 14 రీల్స్ నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న నితిన్ ఇప్పుడు తన రెమ్యూనరేషన్ పెంచాడట!! ఇప్పటి వరకు 3 నుండి 4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నితిన్ ”అ..ఆ” సినిమా తరువాత తన రెమ్యూనరేషన్ ను 7 కోట్లకు పెంచాడని తెలిసింది. ఈ సినిమా తరువాత నితిన్ మరో రెండు సినిమాలకు సన్నాహాలు మొదలు పెట్టాడు.