డిజాస్టర్ సినిమాకు 50 మిలియన్ల వ్యూవ్స్!

Wednesday, June 13th, 2018, 05:40:16 PM IST

గత ఏడాది నితిన్ లై సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఎక్కువగా విదేశాల్లో సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారు. మేఘ ఆకాష్ హీరోయిన్ గా నటించగా విలన్ గా సీనియర్ నటుడు అర్జున్ కనిపించారు. ఇకపోతే ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నితిన్ అభిమానులను కూడా సినిమా నిరుత్సాహ పరచింది.

అలాగే భారీ స్థాయిలో నష్టాలను కూడా మిగిల్చింది. ఇకపోతే తెలుగులో ఇంత డిజాస్టర్ అయినా ఈ సినిమా హిందీలో డబ్ చేసి యూ ట్యూబ్ లో రిలీజ్ చేయగా మంచి వ్యూవ్స్ అందుకుంది. లై సినిమాకు 50 మిలియన్ల వ్యూవ్స్ అందడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. గత ఏడాది ఆగస్టులో రిలీజ్ అయినా ఆ సినిమా వల్ల నితిన్ డీలా పడ్డాడు. దాని తరువాత వచ్చిన ఛల్ మోహన్ రంగ కూడా ఊహించని విధంగా డిజాస్టర్ అందుకుంది. ఇక ప్రస్తుతం ఎలాగైనా హిట్ కొట్టాలని శ్రీనివాస కళ్యాణం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో నితిన్ వస్తున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఆ సినిమాకు సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments