పవన్ సినిమా తరవాత నితిన్ సంతకం పెట్టినవి ఇవే

Friday, February 10th, 2017, 11:48:07 AM IST


అ ఆ సినిమా తరవాత ఆరు నెలల పైగా గ్యాప్ తీసుకున్నాడు హీరో నితిన్ సరైన స్క్రిప్ట్ లేకనో మరేదో కారణం వల్లనో కానీ నితిన్ కి రెండు కొత్త సినిమాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి చాల టైం పట్టేసింది. 14 రీల్స్ నిర్మాణం లో హను రాఘవపూడి తో ఒక సినిమా చేస్తునన్ నితిన్ ఇప్పుడు మరొక సినిమాని కూడా మొదలెట్టాడు. పవన్ కళ్యాణ్ నిర్మాతగా డైరెక్టర్ కృష్ణ చైతన్య డైరెక్షన్ లో లై అనే ఒక సినిమా శురూ చేసాడు. దీని తర్వాత నితిన్ చేయబోయే సినిమా కూడా ఖరారైపోవడం విశేషం. గత ఏడాది ‘మీలో ఎవరు’ కోటీశ్వరుడు’ సినిమాను నిర్మించిన కె.కె.రాధామోహన్ తో నితిన్ చేయబోతున్నాడు.సంపత్ నంది ‘ఏమైంది ఈవేళ’తో నిర్మాతగా పరిచయమైన రాధామోహన్.. ఆ తర్వాత అదే దర్శకుడితో ‘బెంగాల్ టైగర్’ లాంటి భారీ చిత్రాన్ని నిర్మించాడు. ఆ రెండు సినిమాలూ ఆయనకు మంచి ఫలితాన్నే ఇచ్చాయి కానీ.. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ మాత్రం తేడా కొట్టేసింది. రాధామోహన్ ఈసారి కొంచెం పెద్ద స్థాయి సినిమానే చేయాలనుకుని నితిన్ ను లైన్లో పెట్టాడు.