యేలేటి దర్శకత్వంలో.. నితిన్ ?

Saturday, June 2nd, 2018, 10:53:24 AM IST

వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న నితిన్ మళ్ళీ గాడి తప్పినట్టున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న చిన్నదానా నీకోసం, లై, చల్ మోహనరంగా సినిమాలు ఆశించిన స్థాయి విజయం సాధించలేదు. దాంతో మంచి హిట్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటిస్తున్న నితిన్ మరో సినిమాకు ఓకే చెప్పాడు. ప్రయోగాల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించ నున్నాడు. ఇప్పటికే కథ చర్చలు జరిగిన ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి రానుంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని టాక్. త్వరలోన్ ఈ సినిమాకు సంబందించిన న్యూస్ వెలువడనుంది.

  •  
  •  
  •  
  •  

Comments