ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ తో నితిన్ హిట్టు కొడతాడా?

Wednesday, May 2nd, 2018, 06:05:22 PM IST

టాలీవుడ్ లో గత కొంత కాలంగా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తోన్న హీరో నితిన్. లై – ఛల్ మోహన్ రంగ సినిమాల ద్వారా పెద్దగా హిట్ అందుకోలేని నితిన్ ఈ సారి ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఛలో సినిమా ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేయడానికి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. సింగిల్ సిట్టింగ్ లో కథను ఒకే చేసినట్లు తెలుస్తోంది. చివరగా అఆ సినిమాతో భారీ హిట్ అందుకున్న నితిన్ కు వరుసగా రెండు అపజయాలు భారీ దెబ్బ కొట్టాయి. దీంతో ఈ సారి చేసే సినిమాకు పలు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో ముందు నుంచే ఒక ప్లాన్ వేసుకోనున్నట్లు సమాచారం ఇక హీరోయిన్ గా మెహ్రీన్ ను ఫిక్స్ చేశారు. నితిన్ హోమ్ బ్యానర్ లోనే తెరకెక్కబోయే ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది. ప్రస్తుతం నితిన్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీనివాస కళ్యాణం అనే సినిమా చేస్తున్నాడు.

Comments