నిత్యానందకు రెండోసారి కూడా..

Saturday, September 13th, 2014, 05:09:45 PM IST


బిడిది ధ్యానపీఠం ఆశ్రమాధిపతి నిత్యానందస్వామి కేసులు ఇప్పట్లో తేలేలా లేవు.నిత్యానందకు మరోసారి పురుషత్వ పరీక్షలు చేయనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశంతో నిత్యానంద ఈ నెల 8 న పురుషత్వ పరీక్షలు చేయించుకోగా, అవి అసమగ్రంగానే ముగిసినట్టు సమాచారం. సంపూర్ణ ఫలితం రావాలంటే మరోసారి పరీక్షలు నిర్వహించకతప్పదని వైద్యులు భావిస్తున్నారు.

బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో ఆయనకు పురుషత్వ పరీక్షలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పరీక్షల నివేదికను అక్కడి డాక్టర్లు ఇంకా పోలీసులకు అందజేయలేదు. మరోసారి పరీక్షలు జరిపిన అనంతరమే, పూర్తిస్థాయి నివేదికను అందజేసే అవకాశాలున్నాయి.

గతంలో రంజీతతో వ్యవహారం నడిపి దొరికిపోయిన నిత్యానంద లీలలు ఆ తర్వాత ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. దీంతో ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. తాను పురుషుడిని కానని తనకు వాంచలు ఉండవని తప్పించుకోవాలని చూసిన నిత్యానంద స్వామికి కోర్టు ఝలక్ ఇచ్చింది. నిత్యానందకు పురుషత్వ పరీక్షలు నిర్వహించాలని గతంరామనగర జిల్లా కోర్టు ఆదేశించింది. అయితే జిల్లా కోర్టు ఆదేశాలపై నిత్యానంద హైకోర్టును ఆశ్రయించాడు. పురుషత్వ పరీక్షల నుంచి తనను మినహాయించాలని హైకోర్టును కోరాడు. తాను థార్మిక గురువునని, తనకు ఐహిక సుఖాలపై వాంఛలు ఉండవని, అందువల్ల తనకు పురషత్వ పరీక్షలు నిర్వహించకూడదని కోర్టుకు తెలిపాడు.

ఈ కేసును విచారించిన హై కోర్టు నిత్యానంద దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. సాధారణ ప్రజల మాదిరిగానే నిత్యానందను విచారించాలని అవసరమైన పరీక్షలు నిర్వహించవచ్చునని కోర్టు తీర్పు చెప్పింది.