నాకు ఓ క్లారిటీ ఉంది.. బరువు పెరగడంపై నిత్యా కామెంట్స్!

Monday, September 10th, 2018, 02:46:19 PM IST

కొత్తగా నటీమణులు ఎంత మంది వస్తున్నా కూడా కొందరికి ఉండే ఆదరణ చాలా ప్రత్యేకం. వారిని ఎన్నేళ్ళైనా జనాలు మర్చిపోరు. అలాంటి వారిలో నిత్యా మీనన్ ఒకరు. అమ్మడు కెరీర్ మొదటి నుంచి జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తోంది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే ఇటీవల నిత్యకు అవకాశాలు బాగా తగ్గాయి. అందుకు ఆమె లావుగా ఉండటమే అని మీడియాల్లో అనేక కథనాలు వెలువడ్డాయి.

ఆ విషయంపై నిత్యా రీసెంట్ గా స్పందించింది. ‘లావుగా అవ్వడం అనేది స్వాగత విషయం. అందుకే ఇలా ఉన్నా. అలా అని నేను ఫీల్ అవ్వడం లేదు. నా లైఫ్ లో నేను ఎలా ఉండాలని అనుకంటున్నానో అది నాకు తెలుసు. ఓ క్లారిటీతో అయితే ఉన్నా’ అని చెబుతూ.. అనవసరంగా ఏ పనిపాట లేనివాళ్లు అనేక విధాలుగా కామెంట్లు చేస్తుంటారని నిత్యా మీనన్ రూమర్స్ కి కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి ‘నా ఇష్టం ఉన్నట్లు ఉంటా’ అని అమ్మడు చెప్పకనే చెప్పింది. ఇక తెలుగులో నిత్యా నటించిన చివరి చిత్రం అ!. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ చిత్రంలో అవకాశం వచ్చినా కానీ నిత్యా తిరస్కరించినట్లు వార్తలు వచ్చాయి. ఆ విషయంపై నిత్యా ఎక్కువగా స్పందించలేదు.

  •  
  •  
  •  
  •  

Comments