ఆ పాత్ర చేయడానికి నిత్యా మీనన్ నో చెప్పిందా ?

Saturday, February 3rd, 2018, 01:07:24 PM IST

మహా నటుడు అన్న నందమూరి తారక రామారావు బయోపిక్ తెరకెక్కించేందుకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నా విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాకోసం అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు నటీనటులను ఈ సినిమాలో నటింప చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్ర కోసం నిత్యా మీనన్ ను అడిగారని తెలిసింది. అయితే ఈ పాత్రను తానూ చేయలేనని చెప్పిందట నిత్యా. ఈ పాత్రకోసం ఇంకెవరిని సంప్రదిస్తారో చూడాలి. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వర రావు పాత్ర కోసం కూడా అన్వేషణ జరుగుతుంది. మొత్తానికి భారీ తారాగణంతో భారీ స్థాయిలో రూపొందించే సన్నాహాలు చేస్తున్నాడు బాలయ్య. తేజ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయ్.