జయలలిత బయోపిక్ లో నిత్యా మీనన్?

Sunday, September 23rd, 2018, 03:03:31 AM IST

తమిళనాడు రాజకీయాల్లో ఆమెది ప్రత్యేక శైలి .. ఆమె శాసించిందంటే .. అదే శాసనం .. ఎంతటి వారినైనా గడగడలాడించి .. పేద ప్రజలకు అమ్మలా మారిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథతో తమిళంలో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రియదర్శిని దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకు ది ఐరన్ లేడి అని టైటిల్ పెట్టారు .. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. అయితే ఈ సినిమాలో జయలలిత పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ని ఎంపిక చేసారు దర్శక నిర్మాతలు .. కానీ వరలక్ష్మి కి అంత ఇమేజ్ లేదు .. పైగా సినిమా మార్కెట్ కూడా కాదన్నా ఆలోచనతో ఇప్పుడు ఆమె స్థానంలో క్రేజీ భామ నిత్యా మీనన్ ని అడిగారట. నిత్యా అయితే జయ పాత్రలో బాగా ఉంటుందని భావించిన సదరు దర్శక నిర్మాతలు నిత్యా తో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం కోడంబాకం లో ఉన్న జయ స్టూడియోలోనే వేసిన ప్రత్యేక సెట్స్ లో షూటింగ్ జరుపుతారట. మరో వైపు జయలలిత బయోపిక్ తీయడానికి ఇప్పటికే తెలుగు యువ నిర్మాత విష్ణు ఇందూరి కూడా సిద్ధం అవుతున్నాడు. ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో ఈ సినిమాకు అప్పుడే స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుంది. దాంతో పాటు మరో సినిమాకు రంగం సిద్ధం అవుతుంది. మొత్తానికి జయ లలిత జీవిత కథ ఎవరు బాగా చెబుతారా అన్న ఆసక్తి అటు తమిళ జనాల్లో ఉంది.