కుర్ర హీరో సరసన నివేద థామస్ ?

Friday, June 8th, 2018, 11:19:15 AM IST

నాని హీరోగా జెంటిల్మెన్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ నివేద తమన్ ఆ తరువాత వరుస సినిమాలతో బిజీగా మారింది. ఆ తరువాత రెండు వరుస పరాజయాలు రావడంతో పాపం కెరీర్ కు బ్రేక్ పడింది. దాంతో అవకాశాలు తగ్గాయి. ఈ విషయంలో ఆలోచించిన ఈ అమ్మడు ఓ కుర్ర హీరో సరసన నటించేందుకు ఓకే చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే శ్రీ విష్ణు హీరోగా మెంటల్ మదిలో ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు రెడీ అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. మరి ఈ సినిమాతో అయినా మళ్ళీ బిజీగా మారేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది నివేద థామస్.