రవితేజ సరసన నాని హీరోయిన్ ?

Saturday, March 10th, 2018, 03:17:31 PM IST

మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోని చిత్రం లేటెస్ట్ గా మొదలైన విషయం తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అమెరికాలో జరగనుంది. అయితే ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని తెలిసింది. అందులో ఇప్పటికే ఓ హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ ని ఎంపిక చేసారు. ఇక మరో హీరోయిన్ గా కాజల్ ని అడిగారని తెలిసింది. అయితే .. కాజల్ నో చెప్పడంతో మరో హీరోయిన్ తీసుకోవాలని శ్రీను వైట్ల ట్రై చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో నివేద థామస్ ని హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేశారట. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నారట. నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న నివేద థామస్ నటిగా ఎక్కువ మార్కులు కొట్టేసింది. ఇందులో కూడా ఆమె నటనకు స్కోప్ ఉన్న పాత్రలోనే కనిపిస్తుందని టాక్. అమర్ అక్బర్ ఆంటోని పేరుతొ తెరకెక్కే ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఉంటుందని టాక్ ?