నిజామాబాద్‌లో దారుణం.. ఆటోలో కరోనా డెడ్‌బాడీ తరలింపు..!

Sunday, July 12th, 2020, 12:43:41 AM IST

తెలంగాణలో కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో నిజామాబాద్‌లో కరోనా వైరస్ కారణంగా మృతిచెందిన ఓ వ్యక్తి శవాన్ని ఆటోలో తరలించడం పలు విమర్శలకు దారితీస్తుంది. కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు ఎలా నిర్వహించాలనే అంశంపై కేంద్రం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికి ఇలా ఆటోలో శవాన్ని తీసుకెళ్ళడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.

అయితే ఆస్పత్రిలో వైద్యులు ఎవరూ పట్టించుకోకపోవడం, అంబులెన్స్‌ కూడా అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా ఆటోలో తరలించామని బాధితుడి కుటుంబీకులు, బంధువులు చెబుతున్నారు. అయితే తరలించేటప్పుడు ఆటో డ్రైవర్ కానీ, పక్కనే ఉన్న మరో వ్యక్తిగానీ పీపీఈ కిట్లు ధరించకపోవడం గమనార్హం.