కరోనా ఎఫెక్ట్ : మళ్ళీ వాయిదాపడ్డ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలు…?

Saturday, May 23rd, 2020, 07:30:10 AM IST

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగాల్సిన ఉపఎన్నికలు ఇప్పటికే మహమ్మారి కరోనా వైరస్ తీవ్రత కారణంగా వాయిదాపడ్డ సంగతి మనకు తెలిసిందే. కాగా ఈ నెల 7న జరగాల్సిన ఉపఎన్నిక ఇప్పటికే ఓసారి వాయిదా పడగా, రాష్ట్రంలో ప్రస్తుతానికి మహమ్మారి కరోనా తీవ్రత పెరుగుతున్న కారణంగా ఈ ఉపఎన్నికలని మళ్ళీ ఒకసారి వాయిదా వేశారు. కాగా ఈ వాయిదాని తాజాగా 45 రోజుల పాటు పొడగించారని సమాచారం. కాగా నిజామాబాద్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక రావడంతో, గత మార్చి 12న సంబంధిత నోటిఫికేషన్ జారీ చేయగా, మే 7న ఎన్నికలు జరుగుతాయంటూ గతంలోనే పేర్కొన్నారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా విధించినటువంటి లాక్ డౌన్ కారణంగా ఆ ఎన్నిక వాయిదా పడింది.

కాగా అధికార తెరాస పార్టీ తరపున నిజామాబాద్ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి భూపతిరెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు, తెరాస కి గుడ్ బై చెప్పి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. కొన్ని కామరణంలా వలన ఆయనపై అనర్హత వేటు వేయడంతో అక్కడ ఉప ఎన్నికలు జరిపించాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఈ స్థానం నుంచి, ఈసారి టీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఎంపీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో నిలిచారు.