శ్రీశాంత్, చండీలాకు నో బెయిల్

Tuesday, June 4th, 2013, 05:17:03 PM IST

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్ట్ అయిన శ్రీశాంత్, చండీలాకు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. వీరిద్దరికి జూన్ 18వ తేదీ వరకూ జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు ఇదే కేసులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ తోపాటు విందూసింగ్ కు ఊరట లభించింది. గురునాథ్ , విందూలతోపాటు ఐదుగురికి ముంబై కోర్టు బెయిల్ మంజూరుచేసింది. 25వేల రూపాయల పూచీకత్తుతోపాటు పలు షరతులతో బెయిల్ ఇచ్చింది. గురునాథ్ , విందూలతోపాటు మరో ముగ్గురు బుకీలకు షరతులతో ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.