స్పైడర్ బెనిఫిట్ షోలు అందుకే లేవంట !

Wednesday, September 27th, 2017, 12:39:21 AM IST

మహేష్ బాబు నటించిన స్పైడర్ చిత్రం బుధవారం భారీ విడుదలకు అంతా సిద్ధం అయింది. ఈ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంపై ఏస్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల సినిమాల విడుదల సందర్భంలో అభిమానులు బెనిఫిట్ షోల ఆశిస్తారు. టికెట్టు రేటు ఎంతైనా బెనిఫిట్ షోలో తమ అభిమాన హీరోని చూసి మురిసిపోవాలని వీరాభిరామానులు భావిస్తారు. కానీ ఆ విషయంలో మహేష్ అభిమానులకు నిరాశ తప్పడం లేదు.

ఎందుకంటే ఈ చిత్ర బెనిఫిట్ షోల పై చిత్ర యూనిటే ఆసక్తిగా లేదని సమాచారం. స్పైడర్ రెగ్యులర్ తెలుగు కమర్షియల్ చిత్రం కాదు. బెనిఫిట్ షోలో తమ అభిమాన హీరో చెప్పే భారీ డైలాగులకు, స్టెప్పులకు థియేటర్ లో మోతెక్కించాలని అభిమానులు భావిస్తారు. కానీ స్పైడర్ చిత్రంలో సగటు మాస్ అభిమాని ఆశించినవి ఉండవు. ఇది క్లాస్ చిత్రం కావడంతో చిత్ర యూనిట్ బెనిఫిట్ షోలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉండడంతో రెగ్యులర్ షోల ద్వారానే చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు సమాచారం. కానీ ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులలో బెనిఫిట్ షో లని ప్రదర్శించే పరిస్థితి కూడా లేదు.

  •  
  •  
  •  
  •  

Comments