ఎన్టీఆర్ బయోపిక్ కోసం స్టార్స్ వద్దట ?

Thursday, May 31st, 2018, 10:12:46 AM IST

మహానటుడు అన్న నందమూరి తారకరామారావు బయోపిక్ మళ్ళీ మొదలవుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ హీరోగా తేజ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా నుండి తేజ ఆకస్మికంగా తప్పుకోవడంతో అందరు షాక్ అయ్యారు .. అసలు ఈ బయోపిక్ పట్టాలు ఎక్కుతుందా లేదా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య తనతో గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన క్రిష్ కి దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పాడు. ఇక క్రిష్ కూడా బాలీవుడ్ లో కంగనా రనౌత్ తో చేస్తున్న మణికర్ణికా సినిమా పూర్తవ్వడంతో ఇప్పుడు అయన ఫోకస్ ఎన్టీఆర్ సినిమా పై పెట్టేసాడు. ఈ సినిమాలోని నటీనటుల విషయంలో స్టార్స్ ని తీసుకోవాలని బాలయ్య ప్లాన్ చేసాడట. ఈ సినిమాలో శ్రీదేవి, జయప్రద, జయసుధ లాంటి స్టార్స్ ఉంటారని .. వాళ్ళ ప్లేస్ లో స్టార్ హీరోయిన్స్ ని తీసుకోవాలని ప్లాన్ చేసాడట బాలయ్య కానీ స్టార్ హీరోయిన్స్ వద్దనే ఆలోచనలో క్రిష్ ఉన్నాడట. అలా స్టార్స్ ని తీసుకోవడం వల్ల బడ్జెట్ పెరిగే అవకాశం ఉందని ..అంటున్నాడు. ఈ సినిమా విషయంలో క్రిష్ కూడా కెవి రెడ్డి పాత్రలో కనిపిస్తాడని .. ఇటీవలే మహానటి సినిమాలో అయన అదే పాత్రలో కనిపించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరి స్టార్స్ విషయంలో బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments