నో బ్రేక్ ఫర్ .. సైరా ?

Monday, April 9th, 2018, 01:51:21 PM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా సినిమా జోరుగా హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకోసం హైద్రాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో నిరవధికంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం నయనతార, చిరంజీవి లాంటి కీలక నటీనటులు పాల్గొనగా ముఖ్యమైన సన్నివేశాలు రూపొందిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రస్తుతం కర్నూలులోని కోయిలకుంట్ల ట్రెజరీ సెట్స్ లో జారుగుతుంది.

నరసింహ రెడ్డి తన తిరుగుబాటులో కోయిలకుంట్ల ట్రెజరీని కొల్లగొట్టిన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే అమితాబ్ కు సంబందించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తీ చేయడంతో అయన ముంబై వెళ్లిపోయారు. ఈ సినిమాకు ఎక్కడ బ్రేక్ లు వేయకుండా చిత్రీకరణ పూర్తీ చేసి దీపావళి .. లేదా సంక్రాంతికి విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.

  •  
  •  
  •  
  •  

Comments