పాపం .. పెద్ద హీరోలు పూరీని పక్కన పెట్టేసారుగా?

Thursday, January 19th, 2017, 03:51:51 PM IST

puri
క్రేజీ దర్శకుడిగా టాలీవుడ్ లో తనదైన ముద్ర వేసుకున్న పూరి జగన్నాధ్ సినిమాలంటే జనాలకు ప్రేత్యేక ఆసక్తి. స్పీడ్ గా సినిమాలు తీయగల దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న పూరి జగన్నాధ్ కు ఈ మధ్య వరుస ప్లాప్ లు వెంటాడుతున్నాయి. ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవుతున్నాయి.దేవుడు చేసిన మనుసులు, జ్యోతిలక్ష్మి, లోఫర్, ఇజం ఇలా చాలానే ఉన్నాయి. ఇక కాస్త ట్రెండ్ మారుద్దామని మెగాస్టార్ రీ ఎంట్రీ సినిమాగా ఆటో జానీ అంటూ పనులు మొదలు పెట్టాడు కానీ అవి మధ్యలోనే ఆగిపోయాయి. దాంతో చిరంజీవి, వినాయక్ తో కమిట్ అయ్యాడు. ఆ తరువాత వెంకటేష్ తో కూడా సినిమా ప్లాన్ చేస్తున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చాయి .. కానీ అవి వర్కవుట్ అయ్యేలా లేవు. ఇక బాలకృష్ణ తో కూడా సినిమా అన్నారు ? అది ఉట్టి పుకార్లే అని తేలింది. ఇక మహేష్ బాబుతో జనగణమన చేస్తానని ఏడాది క్రితం చెప్పాడు .. అదెప్పుడు వర్కవుట్ అవుతుందో క్లారిటీ లేదు. ఇక ఎన్టీఆర్ సినిమా చేస్తానని అంటున్నాడు, మరి అది వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు. మొత్తానికి కావాలనే పూరి జగన్నాధ్ ని పెద్ద హీరోలు దూరం పెడుతున్నారని ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తుంది?