పాలనపై నోకామెంట్

Tuesday, October 14th, 2014, 03:31:47 PM IST

satyannarayana-rao-m
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధిని బాధించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం. సత్యన్నారాయణ రావు అన్నారు. ఈరోజు ఆయన మాజీ ఉప ముఖ్యమంత్రి నర్సింగ రావు శతజయంతి కార్యక్రమం హైదరాబాద్ నగరంలోని గాంధి భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం. సత్యన్నారాయణ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అయిందని.. ఇప్పుడే ఆ ప్రభుత్వం గురించి తను ఏమి మాట్లాడానని.. ఎం సత్యన్నారాయణ రావు పేర్కొన్నారు.