భరత్ ఫస్ట్ లుక్ లేదట .. డైరెక్ట్ గా టీజరే ?

Monday, January 8th, 2018, 10:24:03 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భరత్ అను నేను సినిమా ఫస్ట్ లుక్ కోసం అయన ఫాన్స్ తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఎక్కువైంది. ఎందుకంటే ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి గా కనిపిస్తాడని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ ఆసక్తి ఎక్కువైంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసే ఆలోచనలో లేరు యూనిట్ సభ్యులు .. ఎందుకంటే ఫస్ట్ లుక్ బదులు .. నా పేరు సూర్య తరహా లో ఓ ఫస్ట్ ఇంపాక్ట్ ని విడుదల చేస్తే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు. అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య ఫస్ట్ ఇంపాక్ట్ సంచలనం రేపుతోంది. కేవలం 29 గంటల్లో కోటి వ్యూస్ సాధించి దుమ్ము రేపింది. ఆ తరహాలోనే భరత్ సినిమా టీజర్ విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఈ ఫస్ట్ ఇంపాక్ట్ టీజర్ ని విడుదల చేస్తారట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ రేపు హైద్రాబాద్ లో మొదలు కానుంది. సో మహేష్ అభిమానులకు నిజంగా ఇది సూపర్ న్యూస్ కదా !!