వర్మ మర్మం భాగా కనిపెట్టాడు! లక్ష్మీస్ ఎన్టీఆర్ పై నో కామెంట్స్!

Wednesday, September 27th, 2017, 04:14:13 PM IST


తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు సంచలనాలకి కేంద్రంగా ఉండే ఒకే ఒక్క దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అతను తీసిన సినిమాలో విషయం ఎంత ఉంది అనేది పక్కన పెడితే, ఆ సినిమా మీద తనదైన స్టైల్ లో హైప్ క్రియేట్ చేయడం వర్మ తర్వాతే ఎవరైనా. వివాదాస్పద అంశాలని తన కథా వస్తువులుగా తీసుకొని సినిమాలని తెరకెక్కించడంలో రాము శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అతని మన తెలుగు సినిమాలో అనే కంటే ఆల్ ఇండియాలోనే తెగింపు ఉన్న డైరెక్టర్ అని కచ్చితంగా చెప్పొచ్చు. ఒక అంశాన్ని కథగా తీసుకున్నప్పుడు అందరు చూసే కోణంలో కాకుండా తాను వేరొక కోణంలో చూస్తాడు. అందుకే అతని సినిమాలు అందరికి అర్ధం కాకపోయినా అందులో ఏదో విషయం ఉందని మాత్రం అర్ధమవుతుంది. ఇక ఈ మధ్య కాలంలో అతని ద్రుష్టి తెలుగు మీద ఉందనే విషయం అందరికి తెలిసిందే.

ఆ మధ్య రాయలసీమలో పరిటాల రవి, మద్దెల చెరువు సూరి మధ్య ఫ్యాక్షన్ గొడవలని రక్త చరిత్ర పేరుతో తెరకెక్కించి. తెలుగులో నిజజీవిత కథలకి రూపం ఇచ్చాడు. ఆ తరువాత చాలా గ్యాప్ తీసుకొని విజయవాడ రౌడీయుజంలో భాగా వినిపించే రంగ కథని, వంగవీటి పేరుతో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు. అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయిన, ఒక సామాజిక వర్గానికి బలంగా ఉన్న నాయకుడు గురించి ఎలాంటి భయం లేకుండా సినిమా తీసి తనని ఎవరు నియంత్రించలేరు అని నిరూపించుకున్నాడు. ఇప్పుడు అది అయిపొయింది. ఇక ఎవ్వరూ ఊహించని విధంగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఎన్టీఆర్ కథని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చే పని పెట్టుకున్నాడు. అది కూడా సినిమాకి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ పెట్టి పెద్ద రాజకీయ సంచలనానికి తెర తీసాడు.

ఈ సినిమా తెరకెక్కిస్తా అని చెప్పిన వెంటనే ఓ వైపు లక్ష్మి పార్వతి నుంచి, మరో వైపు చంద్రబాబు వైపు నుంచి వర్మ మీద ఒత్తిళ్ళు వచ్చాయి. అయితే ఎ మాత్రం తగ్గకుండా తాజాగా తన సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాడు. ఆ ఫస్ట్ లుక్ తోనే టీడీపీ పార్టీ నాయకుల గుండెలో ఓ పిడుగు కూడా పడేసాడు. చీకటి గదిలో కుర్చీలో ఎన్టీఆర్, కుడికాలితో కాలు లోపలి పెడుతూ లక్ష్మి పార్వతి లుక్ తో అతని ప్రేమ, పగ, వెన్నుపోటు అంశాలని తన సినిమాలో చూపిస్తా అని డైరెక్ట్ గా స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసాడు. ఇదంతా భాగానే ఉంది.

అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి నందమూరి ఫ్యామిలీ నుంచి గాని, చంద్రబాబు వైపు నుంచి గాని, టీడీపీ పార్టీ నుంచి గాని డైరెక్ట్ గా వర్మకి ఎలాంటి హెచ్చరికలు రావడం లేదు. దీనికి కారణం లేకపోలేదు. వర్మ తెరకెక్కిస్తున్న స్టొరీ తెలుగు ప్రజలు ఆరాధ్యంగా భావించే ఎన్టీఆర్ కథ. ఇక కథలో ప్రధాన పాత్రధారి ఎన్టీఆర్. ఇలాంటి పరిస్థితిలో టీడీపీ నుంచి సినిమా మీద విమర్శలు వచ్చిన, ఆ పార్టీ నాయకులు ఎవరైనా హెచ్చరికలు చేసిన అది ఆ పార్టీకి పెద్ద ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు నందమూరి ఫ్యామిలీ కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి, ఇక చంద్రబాబు పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా పూర్తిగా ఏమీ తెలుసుకోకుండా స్పందిస్తే అది తన మెడకి చుట్టుకునే అవకాశం ఉంది. దీంతో సినిమా పూర్తి స్థాయిలో అప్డేట్ వచ్చేంత వరకు ఎదురుచూదాల్సిందే. ఎం చేయాలనుకున్న తరువాత చేయాల్సిందే. ఇక నందమూరి ఫ్యామిలీకి కూడా వర్మ తీస్తున్న కథ మీద పెద్దగా అవగాహన లేదు ఇలాంటి పరిస్థితిలో వారు కూడా సైలెంట్ గా ఉండక తప్పని పరిస్థితి. షో ఇంకా ఫస్ట్ లుక్ ఒక్కటే వచ్చింది కాబట్టి పెద్దగా టెన్షన్. సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు నిర్ణయం తీసుకోవడమే.

  •  
  •  
  •  
  •  

Comments