పాపం లక్ష్మి మంచు సినిమా ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు

Friday, February 24th, 2017, 12:03:59 PM IST


కొన్ని సినిమాలు అనుకోకుండా వదిలేస్తూ ఉంటారు హీరోలు హీరోయిన్ లు .. అలాంటిదే లక్ష్మి బాంబు అనే సినిమా .. మూడు నెలల క్రితం నుంచీ వాయిదా పడుతూ వస్తోంది ఈ సినిమా. మంచు లక్ష్మి హీరోయిన్ గా తెరకి ఎక్కిన ఈ చిత్రం ఎక్కువగా వాయిదాలు పడుతూ విడుదల పోస్టర్ లు కూడా వచ్చి ఆగిపోతోంది. మహాశివరాత్రి కానుకగా ఇవాళ రావాల్సి ఉన్నా మళ్ళీ ఆగిపోయింది. ఇవాళే సినిమా అంటూ వీడియో లు కూడా కనపడ్డాయి కానీ విడుదల మాత్రం అవ్వలేదు. సినిమా పట్ల అటు బయ్యర్లలో కానీ.. ఇటు ప్రేక్షకుల్లో కానీ పెద్దగా ఆసక్తి లేకపోవడం వల్లే సినిమాకు ఈ కష్టాలని తెలుస్తోంది.
నిజానికి మంచు లక్ష్మి ఈ సినిమా మీద కొంచెం ఫోకస్ పెడితే విడుదలకు మార్గం సుగమం అవుతుందేమో. ఇంతకుముందు తాను కీలక పాత్రలు పోషించిన సినిమాలన్నింటికీ లక్ష్మి బాగా ప్రమోట్ చేసుకుంది. చివరగా ఆమె లీడ్ రోల్ చేసిన ‘దొంగాట’ను చాలా గట్టిగా ప్రమోట్ చేసింది లక్ష్మి. కానీ ‘లక్ష్మీబాంబు’ మీద ఆమె ఎందుకో కానీ దృష్టిపెట్టట్లేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తుండేసరికి ఆమెకు కూడా విసుగొచ్చేసిందేమో.. ఎక్కడా కూడా దీని ఊసెత్తట్లేదు.