ఆ సినిమాకు రెమ్యూనరేషన్ వద్దన్న ఎన్టీఆర్ ?

Monday, November 6th, 2017, 12:32:50 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటించే సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదన్న వార్త ఆసక్తి రేకెత్తిస్తుంది. అయన నటించిన జై లవకుశ సినిమా అన్న కళ్యాణ్ రామ్ నిర్మాతగా చేసాడు కాబట్టి రెమ్యూనరేషన్ తీసుకోలేదని అనుకుంటున్నారా .. అక్కడే మీరు పప్పులో కాలేసినట్టే? ఆ సినిమాకు ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తీసుకోనని చెప్పినా కూడా కళ్యాణ్ రామ్ ఏంతో కొంత ఇచ్చేసి ఉంటాడు. అయితే ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ తీసుకోనని చెప్పింది త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు !! రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు రెమ్యూనరేషన్ ఎందుకు తీసుకోవడం లేదంటే .. ఈ సినిమా విడుదల తరువాత వచ్చే లాభాల్లో వాటా అఫర్ చేసాడట త్రివిక్రమ్, దాంతో ఓకే చెప్పిన ఎన్టీఆర్ లాభాల్లో వాటా తీసుకుంటానని చెప్పడం విశేషం. ఈ మధ్య హీరోలంతా సినిమాకు రెమ్యూనరేషన్ కాకుండా ఇలా బిజినెస్ లో ఎంట్రీ ఇచ్చి వాటాలు అందుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ ప్రతి సినిమా ప్రొడక్షన్ లో ఎంట్రీ ఇచ్చి ఎంబి కార్పొరేషన్ పై వాటతీసుకుంటున్నాడు. ఇప్పుడు అదేదారిలో ఎన్టీఆర్ కూడా బిజినెస్ రూట్ లో వెళుతున్నాడు అన్నమాట.

  •  
  •  
  •  
  •  

Comments