మహేష్ 24 లో ప్రత్యేక గీతం ఉండదట !

Thursday, January 18th, 2018, 02:49:28 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ఆయన 24 వ చిత్రంగా, కొరటాల శివ దర్శకత్వం లో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై డివివి దానయ్య నిర్మిస్తున్న నూతన చిత్రం ఫస్ట్ లుక్ ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబందించిన వార్త ఒకటి సోషల్ మీడియా లోచక్కర్లు కొడుతోంది.ఈ చిత్రం లో రెండవ అర్ధభాగం లో ఎటువంటి ప్రత్యేక గీతం పెట్టవద్దని, అలా చేస్తే కథ తాలూకు ఫ్లో దెబ్బతింటుందని మహేష్ బాబు, కొరటాలతో అన్నట్లు సమాచారం, తద్వారా ఈ చిత్రం లో ఎటువంటి ప్రత్యేక గీతాలు ఉండవని తెలియవస్తోంది. అయితే ఇదివరకు మహేష్ నటించిన పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్, ఆగడు వంటి చిత్రాల్లోని ప్రత్యేక గీతాలు మంచి జనాదరణ పొందాయి. ఇప్పటికే రెండు పాటలు, రెండు ఫైట్లు మినహా చిత్రం మొత్తం పూర్తి అయిందని తెలుస్తోంది. వేసవి కానుకగా విడుదల అవుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడిగా కైరా అద్వానీ తొలిసారి టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నారు…