విశాఖ టాలీవుడ్‌కి ఉప‌యోగ‌ప‌డ‌ని మంత్రి!!

Tuesday, November 8th, 2016, 06:10:28 PM IST

tollywood
ఏపీ, తెలంగాణ విడిపోయాక .. టాలీవుడ్ విశాఖ న‌గ‌రం త‌ర‌లి వెళ్లే ఊపొచ్చింది. అయితే ఆ ఊపును కాస్తా నీరుగార్చేసేలా ఏపీ రాజ‌కీయాలు కొన‌సాగాయన్న‌ది టాలీవుడ్ పెద్దల మాట‌. హైద‌రాబాద్‌లో ఉన్న ఆస్తుల్ని అమ్ముకుని పోలేక కొంద‌రు వెన‌కాడినా ఇప్ప‌టికీ విశాఖలో తెలుగు సినీప‌రిశ్ర‌మ విస్త‌రిస్తే .. ఆ ప‌చ్చందాల న‌డుమ‌, బీచ్ సొగ‌సుల చెంత అద్భుత‌మైన స‌రికొత్త టాలీవుడ్‌ని నెల‌కొల్పే ఛాన్సుంద‌ని ముచ్చ‌ట‌ప‌డుతున్న‌వాళ్లున్నారు. అయితే అందుకు పూర్తి స్థాయిలో ప్ర‌య‌త్న‌మే క‌నిపించ‌డం లేదు. రాజ‌కీయంగా స‌రైన చైత‌న్యం లేక‌పోవ‌డం వ‌ల్ల కూడా విశాఖ టాలీవుడ్ ఆమ్యామ్యా అయిపోయింది. ఎవ‌రూ స‌రైన ఇనిషియేష‌న్ తీసుకున్న‌ది లేదు.

ఏదో విశాఖ ఫిలిం సొసైటీ బిల్డింగ్ స్థాపించ‌డం, సొసైటీకి కొంత భూమి కేటాయించ‌డం మిన‌హా అంత‌కుమించి వేరే డెవ‌ల‌ప్‌మెంట్ క‌నిపించిందే లేదు. అయితే అందుకు కార‌ణం మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు అంటూ అటువైపే వేళ్ల‌న్నీ చూపిస్తున్నాయి. విద్యాశాఖా మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావుకు సీఎం చంద్ర‌బాబుతో స‌ఖ్య‌త చెడ‌డం కూడా ప్ర‌స్తుతం విశాఖ ఫిలిం ఇండ‌స్ట్రీ వెన‌క‌బాటుకు కార‌ణం అని చెబుతున్నారు. విశాఖ న‌గ‌రంపై ప‌ట్టు కోసం అటు గంటాతో పోటీప‌డుతూ చిన‌బాబు లోకేష్ అన్నిట్లో వేలు పెట్ట‌డం కూడా పెను స‌మ‌స్య‌ను కొని తెచ్చింది. విశాఖ – ఫిలింసొసైటీ భూముల విష‌యంలోనూ గంటా ప్ర‌మేయం లేకుండా చెక్ పెట్టేందుకు లోకేష్ రాజ‌కీయాలు చేయ‌డం పెద్ద చేటు తెస్తోంద‌ని స్థానికంగా చ‌ర్చ సాగుతోంది. త‌న కొడుకుని హీరోని చేయాల‌న్న త‌ప‌న‌లో ఒక‌టో వంతు శ్ర‌ద్ధ‌ కూడా విశాఖ – ఫిలింఇండ‌స్ట్రీ అభివృద్ధిపై గంటా పెట్ట‌లేద‌న్న‌ది ప్ర‌ధాన అభియోగం. అక్క‌డ ప‌రిశ్ర‌మ కాలిపోవ‌డంలో ఆయ‌న గారి పాత్రే ఎక్కువ అని ప్ర‌జ‌ల్లోనూ ప్ర‌చారం సాగుతోంది. మొత్తానికి కోట్లాది ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఉపాధిపై దెబ్బ కొట్టి ఉసురు తీస్తున్నార‌ని గంటాపై విరుచుకుప‌డుతున్నారంతా. మ‌రి దీనికి మంత్రి వ‌ర్యులు ఏం స‌మాధానం చెబుతారో?