పవన్ ను అన్న వాళ్లంతా ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకుంటారో.?

Friday, July 12th, 2019, 01:00:36 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఇతర పార్టీల వారు చేసే విమర్శలు ఏమన్నా ఉన్నాయి అంటే అది పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు,పవన్ ప్యాకేజీ తీసుకున్నాడు,పవన్ ఆవేశ పరుడు కోపంతో ఊగిపోతుంటాడు అని అంటుంటారు.అయితే పవన్ పెళ్లిళ్ల విషయం ఒక తెరిచిన పుస్తకం ఇక ప్యాకేజీ విషయం అంటే దానికి ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లేని బేస్ లెస్ అలిగేషన్ ఒకవేళ నిజంగా తీసుకున్నట్లయితే తెలుగు తమ్ముళ్లు ఊరుకుంటారా? పవన్ ఇమేజ్ ను మాతో కలిసే ఉన్నాడు అని విష ప్రచారం చేసిన దానికన్నా ఎక్కువ చేసి చూపించేవారు.

ఇక మూడో అంశం పవన్ ఆవేశ పరుడు ఊగిపోతుంటాడు అని అంటారు.అయితే పవన్ సందర్భానుసారం ప్రజలు ఉత్తేజ పరచడానికి అలా మాట్లాడుతారు తప్ప మరెక్కడా నోరు జారిన దాఖలాలు ఎక్కడా లేవు.దీనికి చిన్న ఉదాహరణగా పవన్ డల్లాస్ సభను చెప్పవచ్చు పవన్ అక్కడ మాట్లాడిన విధానం నిజంగా చాలా అభినందనీయం.ఒక్క మాట కూడా అగ్రెస్సివ్ గా మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా పవన్ మాట్లాడారు.

అయితే ఈ విషయం ఇప్పుడు ఎందుకు చర్చకు వచ్చిందంటే పవన్ కోపంతో మాట్లాడ్డం ఆవేశంతో ఊగిపోవడం తప్ప ఏమీ చెయ్యదు అని అనే వారిలో అధిక శాతం వైసీపీ అభిమానులు కూడా ఉన్నారు.ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగన్ మాట్లాడిన తీరును కానీ గమనిస్తే ఇప్పుడు వీరంతా ఎక్కడ దాక్కుంటారో చూడాలి.”మేము 150 మంది ఉన్నాం మీరు 23 మందే ఉన్నారు మేము అంతా లేస్తే మీ స్థానాల్లో మీరు ఉంటారా?”

అని వార్నింగ్ లు ఇవ్వడం అదే అసెంబ్లీ ఆగ్రహావేశాలతో ఊగిపోయి టీడీపీ నేతలను ఏహ్ కూర్చోవయ్యా అంటూ పలుమార్లు అరుస్తున్నారు.మరి జగన్ గారు అందులోను రాష్ట్రం మొత్తం చూస్తున్న అసెంబ్లీలో ఇలా ప్రవర్తించడం ఎంత వరకు సబబు?ఒకప్పుడు పవన్ బయట ఆగ్రహంగా మాట్లాడితేనే ఎన్నో మాటలు అన్న వారంతా ఇప్పుడు ఇది చూస్తే ఏమంటారు వాళ్ళ మొహాలు ఎక్కడ పెట్టుకుంటారని జనసేన శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.