మూడు జేసిబిలు విరిగిపోయాయి..చెక్కు చెదరని ఆంజనేయ విగ్రహం..!

Tuesday, January 16th, 2018, 01:20:54 AM IST

గత మూడు రోజులుగా ఉత్తరప్రదేశ్ లోని అధికారులు 130 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంజనేయ విగ్రహాన్ని కదల్చడానికి ప్రయత్నిస్తున్నా వారి తరం కావడం లేదు. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో ఆలయం ఎదుట భారీ విగ్రహం ఉంది. యూపీ ప్రభుత్వం రోడ్డు విస్తరణ పనులు చేతుండడంతో ఆ ఆంజనేయ విగ్రహాన్ని అక్కడినుంచి వేరే చోటకి తరలించాలని నిర్ణయించారు. క్రేనల్తో, జేసీబీలతో ప్రయత్నించయినా కనీసం విగ్రహం ఇంచు కూడా కదలక పోవడం గమనార్హం.

ఇప్పటికే ఆ విగ్రహాన్ని పెకలించాడనికి ప్రయత్నించినా మూడు జేసీబీలు విరిగిపోయాయి. దీనివలన రోడ్డు కాంట్రాక్టు పొందిన సంస్థకు లక్షల్లో నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఇదంతా హనుమంతుడి మహిమ అని స్థాయినికులు నమ్ముతున్నారు. హిందూ పరిరక్షణ సంఘాలు అక్కడి నుంచి విగ్రహాన్ని తొలగించడానికి వీల్లేదని డిమాండ్ చేస్తున్నాయి.