షాకింగ్ : నాన్ వెజ్ తినేవాళ్లు అంతా హంతకులే..అసలేం జరుగుతుంది?

Sunday, December 22nd, 2019, 04:29:31 PM IST

జీవ పరిణామం మొదలయ్యినప్పటి నుంచి ఈ ప్రకృతిలో ఎన్నో సహజమైన మార్పులు సంభవించాయి.అలాగే జీవులు తమ జీవిత కాలంలో మనుగడ సాగించేందుకు జీవ క్రియలలో భాగంగా ఓ జీవి మరో జీవిపై ఆధార పడడం మొదలు పెట్టింది.అలాగే మనుషుల కూడా మొదలయింది.అయితే ఏ జీవి అయినా సరే మనుగడ సాగించడానికి శక్తి కావాలి.శక్తి కావాలంటే ఉన్న ఏకైక మార్గం ఆహరం.అయితే కాలానుగుణంగానే శాఖాహార మరియు మాంసాహార జీవులు ఏర్పడ్డాయి.

అయితే ఓ జీవి మరో జీవిని చంపి తినడం ఎప్పటి నుంచో ఉన్న సృష్టి ధర్మం అని అందరికి తెలుసు.కానీ కొన్ని జీవాల విషయానికి వస్తే మనుషులలో ఉండే భావోద్వేగాలు వాటిని తినకుండా ఇతర ఆహార పదార్ధాలపై ఆధార పడతారు.ఇక్కడే ఇప్పుడు దేశంలో పెద్ద ఎత్తున రగడ మొదలయ్యింది.శాఖాహారులు మరియు మాంసాహారులు మధ్య సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది.మాంసాహారం తినే వారంతా హంతకులు అని ఒక హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతుంది.

“నాన్ వెజిటేరియన్స్ ఆర్ కిల్లర్స్” అంటూ ట్విట్టర్ మూడు లక్షలకు పైగా ట్వీట్లు పడ్డాయి.ఇంకా కొనసాగుతున్నాయి.దీనితో ఈ అంశం ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా నాలుగో స్థానంలో ట్రెండ్ అవుతుంది.మూగ జీవాలను చంపి తినే ధర్మం తమ మతంలో లేదని వారి పవిత్ర గ్రంథాలలో ఉన్న సందేశాన్ని కూడా కొంతమంది వైరల్ చేస్తున్నారు.అయితే వీరి భావోద్వేగాన్ని ఖండించడం లేదు కానీ మరి “ప్యూర్ వెజిటేరియన్స్” అంతా హంతకులు కాదా..?మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుందని ప్రముఖ శాస్త్రవేత్త “జగదీష్ చంద్రబోస్” ఎప్పుడో సైంటిఫిక్ గా కూడా నిరూపించారు.అంటే ఆకు కూరలు తినే వారు కూడా హంతకులేనా.?