అక్కడ వెడ్డింగ్ విషయంలో హ్యాపీగా లేరట ?

Thursday, July 26th, 2018, 11:23:47 AM IST

మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహారికా కొణిదల కొంత గ్యాప్ తరువాత మళ్ళి తెలుగులో హీరోయిన్ గా హ్యాపీ వెడ్డింగ్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది. సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా విషయంలో తెలుగులో పెద్ద హైప్ మాత్రం ఏమి లేదు .. కానీ సినిమా విడుదల తరువాత మంచి హైప్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు టీమ్. పూర్తీ స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి సినిమా మంచి హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. కానీ తాజాగా అమెరికాలో ఈ సినిమాపై ఆశించిన స్థాయిలో క్రేజ్ మాత్రం రావడం లేదు .. బిజినెస్ పరంగా ఎలాంటి క్రేజ్ కూడా రావడం లేదట .. దాంతో నిర్మతలు టెన్షన్ మీదున్నారు. ప్రస్తుతం సినిమాలకు కీలకంగా మారిన ఓవెర్సెస్ మార్కెట్ లోనే హ్యాపీ వెడ్డింగ్ కు హ్యాపీ మిస్ అవ్వడం ఆసక్తి రేపుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments