జగన్ పాత్ర లేకుండానే వై ఎస్ బయోపిక్ ?

Friday, October 5th, 2018, 09:32:34 PM IST


కాంగ్రెస్ పార్టీ నాయకుడు … మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో తెరకెక్కుతున్న బయోపిక్ యాత్ర. మలయాళ సూపర్ స్టార్ మమ్మూట్టి నటిస్తున్న ఈ సినిమా జోరుగా షూటింగ్ జరుపుకుంటుంది. రాజశేఖర్ రెడ్డి జీవిత కథలో భాగంగా .. అయన బాల్యం రాజకీయ ప్రస్థానం నుండి .. ముక్యంగా అయన పాదయాత్ర .. ఆ తరువాత ముఖ్యమంత్రిగా మారిన కథతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ లకు అనూహ్యమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. అయితే ఇందులో వై ఎస్ జగన్ పాత్ర కూడా ఉంటుందని .. అయన పాత్రలో ఎవరు నటిస్తారన్న విషయంపై ఇప్పటికే తమిళ హీరోలు సూర్య, కార్తీల పేర్లు వినిపించాయి, ఆ తరువాత విజయ్ దేవరకొండ పేరుకూడా వినిపించింది. కానీ తాజాగా వస్తున్నా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వై ఎస్ జగన్ పాత్ర లేకుండా సినిమాను తెరెకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం వై ఎస్ ముఖ్యమంత్రి అవ్వడంతో కథ సుకాంతం అవుతుందని .. అందువల్ల జగన్ పాత్ర అవసరం లేదని మేకర్స్ భావిస్తున్నారట. ఒకవేళ జగన్ పాత్ర పెడితే దానికి ప్రాముఖ్యత ఉండేలా చూడాలి కాబట్టి .. కేవలం వై ఎస్ పైనే ఫోకస్ పెట్టి ఈ కథను నడిపిస్తారట. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.