తెలంగాణాలో నోటా విడుదలకు అడ్డంకులు తప్పవా ?

Tuesday, October 2nd, 2018, 10:33:59 AM IST

విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న చిత్రం నోటా . ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానున్న నేపథ్యంలో నిన్న నోటా పబ్లిక్ మీటింగ్ హైద్రాబాద్ లో జరిగింది. అంతకు ముందు రోజు విజయవాడలో ఇదే తరహాలో మీటింగ్ జరిగింది. అయితే ఈ సినిమా విడుదల విషయంలో తెలంగాణలో అడ్డంకులు తప్పేలా లేవని తెలుస్తోంది. ఎందుకంటే తెలంగాణాలో త్వరలోనే ఎన్నికలు జరిగనున్నాయి కాబట్టి .. ఈ సినిమా రాజకీయ పార్టీలకు సంబందించిన సన్నివేశాలు ఉన్నాయని .. ఇది ఒక రాజకీయ పార్టీ తరపున ప్రచారంలా ఉంటుందంటూ మాజీ సెన్సార్ సభ్యుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ చిత్రాన్ని డిజిపి చూసాకే విడుదల అనుమతి ఇవ్వాలని అయన కోరారు. మరో వైపు ఈ సినిమా విషయంలో విజయ్ దేవరకొండ కూడా రాజకీయ పార్టీలను కెలికేలా కామెంట్స్ చేయడంతో కొన్ని పార్టీల వారు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఈ సినిమా ఎన్నికల తరువాత విడుదల చేయాలనీ మరొకొందరు కోర్టును ఆశ్రయించే సన్నాహాల్లో ఉన్నారట. మొత్తానికి నోటా విషయంలో పెద్ద దుమారం రేగుతుంది.