నోటా నైజాం హక్కులకోసం భారీ పోటీ ?

Sunday, September 23rd, 2018, 07:31:51 PM IST

అర్జున్ రెడ్డి స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం నోటా. తమిళ తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల కానుంది. హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా గీత గోవిందం సంచలన విజయం సాధించడంతో పాటు అటు బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 100 కోట్ల వసూళ్లను అందుకుంది. దాంతో అయన నెక్స్ట్ సినెమా పై భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిన విజయ్ నోటా సినిమా థియేట్రికల్ హక్కుల కోసం భారీ పోటీ నెలకొంది. వీ సినిమా నైజం హక్కులు 16 కోట్లకు డిమాండ్ చేస్తున్నారట. హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం గీత గోవిందం నైజాం లో 20 కోట్లు వసూళ్లు చేయడంతోనే ఈ సినిమాకు అంత డిమాండ్ చేస్తున్నారట. మరి ఆ రేంజ్ లో నిర్మాత జ్ఞానవేల్ రాజా డిమాండ్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్స్ షాక్ అవుతున్నారట. అయితే సినిమా పై ఉన్న నమ్మకంతోనే అయన అంత రేట్ చెబుతున్నాడని అంటున్నారు. అలాగే మిగతా ఏరియా హక్కులు కూడా భారీ రేటుకే పలుకుతున్నాయట.