కొద్దీ గంటల్లో గెస్ట్ హౌస్ కూల్చేస్తాం – షాక్ లో గంటా

Friday, August 23rd, 2019, 01:54:02 AM IST

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కి వైసీపీ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలోని గంటా శ్రీనివాసరావు గెస్ట్ హౌస్‌ ని 24 గంటల్లో కూల్చేస్తామని నోటీసులు జారీ చేసింది. కాగా వివరాల్లోకి వెళ్తే… గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ రానున్న 24 గంటల్లో గంటా శ్రీనివాస్ కి సంబందించిన గెస్ట్ హౌస్ ని అక్రమ నిర్మాణాల కింద కూల్చేస్తామని నోటీసులు పంపించారు. అయితే అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని ఏపీలో అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. కాగా ఈమేరకు ముందుగా ప్రజా వేదిక భవనాన్ని అలాగే కూల్చేశారు. కాగా ఈమేరకు గంటా శ్రీనివాస్ కి సంబందించిన ఇంటిని కూడా కూల్చేస్తామని నోటీసులు పంపించారు.

అంతేకాకుండా విశాఖకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ భవనాన్ని అక్రమ నిర్మాణం క్రింద జీవీఎంసీ అధికారులు కూల్చేశారు. విశాఖలోని ద్వారకానగర్ మెయిన్‌రోడ్డులో పీలా గోవింద్ కూడా అక్రమ నిర్మాణాన్ని నిర్మించుకున్నారు. కాగా ఆభావనపై సంబంధిత అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలు మార్లు నోటీసులు కూడా పంపించినప్పటికీ కూడా ఎమ్మెల్యే నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో రంగంలోకి దిగిన జీవీఎంసీ అధికారులు గతవారం కూల్చి వేశారు. ఇపుడు కొత్తగా గంటా శ్రీనివాసరావు కి వచ్చిన నోటీసులపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి.