జగన్‌కి ఓటు వేసినందుకు వారంతా ఇప్పుడు బాధపడుతున్నారట..!

Saturday, June 1st, 2019, 09:45:06 AM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ మాత్రం ఊహించని రీతిలో ఓటమి పాలవ్వడం అందరిని కాస్తింత ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మొన్నటి వరకు అధికార పార్టీలో ఉన్న టీడీపీని కాదని ప్రతి ఒక్కరు జగన్ వైపు నిలబడ్డారు. ఉద్యోగులు, యువత, రైతులు, వృద్ధులు, మహిళలు ఇలా ప్రతి ఒక్కరు జగన్‌కే ఓటేయ్యడం వలన వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.

అయితే మూడు రోజుల క్రిందట ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల ప్రచారంలో అన్ని రకాల పెన్షన్లను పెంచుతానని, వృద్ధాప్య పెన్షన్‌ను రూ. 3 వేలకు పెంచుతానని హామీ ఇచ్చారు. అంతేకాదు వృద్ధుల పెన్షన్‌ వయస్సు 65 నుంచి 60 సంవత్సరాలకు తగ్గిస్తానని హామీ కూడా ఇచ్చారు. అయితే మొనా ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన రోజే దీనిపై తొలి జీవో విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఉన్న ఎన్‌టీఆర్ భరోసా పథకాన్ని వైఎస్సార్‌ పెన్షన్‌ పథకంగా పేరు కూడా మార్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఎన్నికల ముందు చెప్పినట్టు వృద్ధులకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి ఇప్పుడు 2250 రూపాయలు మాత్రమే ఇస్తానని, ప్రతి ఏటా 250 పెంచుతూ మొత్తం 4 సంవత్సరాలలో 3000 చేస్తానని చెప్పాడు. అయితే ఈ పథకం జూలై 1 నుంచి అమలవుతుందని చెప్పారు. అయితే ఎన్నికల ముందు చెప్పినట్టు 3000 వేలు కాకుండా 250 రూపాయలు మాత్రమే పెంచడంతో ముసలవ్వలందరూ దేవుడి లాంటి చంద్రబాబును కాదని, జగన్‌ని నమ్మి ఓటు వేసినందుకు మొదటి రోజే మాకు సరైన బుద్ధి చెప్పాడని వాపోతున్నారట. మొదటి రోజే ఇలా మాట తప్పిన జగన్‌పై సామాన్యులు కూడా మండిపడుతున్నారట. అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.