పవన్ కు మళ్లీ ఈ సాయం అవసరమా..?

Monday, February 17th, 2020, 08:06:41 AM IST

ఏపీ రాజకీయ వర్గాల్లో మూడో ప్రత్నామ్యయం అవుదామనుకొని ఉండీ లేని ఒక్క ఎమ్మెల్యేతో సరిపెట్టుకున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అయతే ఓట్ల పరంగా అనుకున్నంత ప్రభావం చూపకపోయినా తాను ఒక్కడిగా మాత్రం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో మరింత దూకుడు పెంచారు.అలాగే పవన్ రాజకీయాల విషయానికి వస్తే తాను సరైన నిలకడ లేని వ్యక్తిగా పలు సందర్భాల్లో ప్రూవ్ చేసుకున్నారు.

ఓ మాట చెప్పేసి దానిని బాగా తప్పిన సందర్భం ఏదన్నా ఉంది అంటే అది తన సినిమాల విషయంలో అని చెప్పాలి.తాను పూర్తిగా సినిమాలు వదిలేసి ఫుల్ టైం పొలిటీషియన్ గా ఉండిపోతాను అని చెప్పినపుడు అతని అభిమానులు కోట్ల డబ్బులు వదిలేసి జనం కోసం వచ్చేసాడు అని ఎమోషనల్ అయ్యిపోయి తాము డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశారు.ఇప్పటికీ ఇస్తూనే ఉన్నారు.అయితే గత ఏడాది ఒక్క పవన్ పుట్టిన రోజునే దాదాపు 3 కోట్ల వరకు జనసేన పార్టీ ఖాతాలో వేశారు.

అప్పుడంటే పవన్ చేతిలో సినిమాలు లేవు కాస్త నిస్సహాయ స్థితి కాబట్టి ఇచ్చారు అనుకోవచ్చు.కానీ ఇప్పుడు మార్చ్ 14 జనసేన ఆవిర్భావం రోజున కూడా డోనేట్ చెయ్యాలి అని భావిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళది కాస్త ఓవర్ ఎమోషనల్ ప్రేమ అనిపించట్లేదా??అప్పుడు అంటే నిజంగా పవన్ చేతిలో సినిమాలు లేవు కాబట్టి ఇచ్చారు.కానీ ఇప్పుడు చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి.కోటాను కోట్ల ఆదాయం ఉంది,ఈ టైం లో కూడా ఇలా ప్లానింగ్స్ వేసి ఇవ్వడం అవసరమా అన్నది వాళ్లే ఆలోచించుకోవాలి.