శ్రీ రెడ్డి ఇప్పుడు నేషనల్ సెలెబ్రిటీ : రామ్ గోపాల్ వర్మ

Sunday, April 8th, 2018, 07:24:23 PM IST

తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వడంలేదని, అలానే ఎవరైనా అమ్మాయిలు అవకాశం కోసం వెళ్తుంటే, వారిని కాస్టింగ్ కౌచ్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదివరకు ఈ విషయమై గాయత్రి గుప్తా, మాధవీలత లాంటి హీరోయిన్స్ మాట్లాడినా, వాళ్ళలా తాను మాత్రం మధ్యలో వదిలేది లేదని, ఈ పోరులో తాను చివరివరకు కొనసాగిస్తాను అని, ఎవరి బెదిరింపులకు భయపడను అని అన్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు పేర్లు, వారి వాట్సాప్ చాట్ వివరాలతో సహా బయటపెట్టిన ఆమె, మా అసోసియేషన్ సభ్యత్వం కోసం నిన్న ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇదే అంశం ఇప్పుడు జాతీయ స్థాయిలో దుమారం రేపుతోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఆ మాటకు వస్తే దేశంలో మరే వుడ్ కు చెందిన నటి కూడా చేయని పని అయినా అర్ధ నగ్న ప్రదర్శనతో సంచలనంగా మారారు శ్రీరెడ్డి. తనను మోసం చేశారంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చకు తెర తీస్తున్నాయి. ఇక, సోషల్ మీడియాతో పాటు, వాట్సాప్ గ్రూపుల్లోనూ ఆమె ఫోటోలు, ఆమెకు సంబంధించిన వార్తలు తెగ షేర్ అవుతున్నాయి.

ఇలాంటి సమయంలో, శ్రీరెడ్డి చర్యపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక ట్వీట్ చేసి మరింత సంచలనానికి తెర లేపారు. శ్రీరెడ్డి జాతీయ స్థాయిలో సెలబ్రిటీగా ఎదుగుతోందని, ముంబయిలో పవన్ కల్యాణ్ గురించి తెలియని వారు సైతం ప్రస్తుతం శ్రీరెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారన్నారు అన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి…..

  •  
  •  
  •  
  •  

Comments