బిగ్ అప్డేట్ : ఇక అంబానీ అప్పులన్నీ తీరిపోయినట్లేనా…?

Saturday, May 23rd, 2020, 04:20:07 PM IST

ఈ మధ్య కాలంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీకి అదృష్టం తరుముకుంటూ వస్తుందని చెప్పాలి. అతను స్వతహాగా స్తాపించినటువంటి జియో కాస్త విదేశీ పెట్టుబ‌డిదారుల‌ను దారుణంగా ఆకర్షిస్తుందని చెప్పాలి. ఒకవైపు దేశంలో కొన్ని టెలికాం సంస్థలు అన్ని కూడా నష్టాల్లో కొట్టుకుంటుండగా, మరికొన్ని మూతబడుతున్నాయి. అంబానీ స్థాపించిన జియో మాత్రం విదేశీ పెట్టుబ‌డుల‌ను బాగా ఆకర్షిస్తూ మంచి లాభాలను తెచ్చిపెడుతుందని చెప్పాలి. కాగా తాజాగా కేకేఆర్ అనే అమెరిక‌న్ సంస్థ జియోలో వాటాలు కొనుగోలు చేసినట్లు అధికారిక సమాచారం. అయితే అమెరికా సంస్థ కొనుగోలు చేసిన వాటాల ప్రకారం దాదాపుగా వాటి విలువ 11 వేల కోట్ల రూపాయలు అని సమాచారం.

కేవలం రిలయన్స్ డిజిటల్ సర్వీసెస్ ప్లాటుఫామ్ లో 2.32 శాతం వాటా కోసం 11,367 కోట్ల రూపాయ‌ల‌ను పెట్టింది ఆ సంస్థ‌. ఇకపోతే కొన్నాళ్ల‌లోనే ముకేష్ అంబానీకి చెందిన వివిధ సంస్థ‌ల్లో వాటాల అమ్మడంవలన 78,562 కోట్ల రూపాయ‌ల‌ను రాబట్టారని సమాచారం. కాగా ముకేశ్ అంబానీ తన ఆదీనంలో ఉన్నటువంటి పలు సంస్థల్లోని వాటాలను అమ్మేసి, అప్పుల‌న్నీ తీర్చేయాల‌ని ముకేష్ భావిస్తున్నార‌ట‌. కాగా ముఖేష్ అంబానీ కూడబెట్టిన వాటికి అంతా రేంజ్ లో ధర పలుకుతుందని అంచనా…