ఇక జగన్ పై భజన మొదలు పెట్టిన పచ్చ మీడియా.!

Tuesday, June 4th, 2019, 07:53:20 AM IST

మనదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉండే వార్తా పత్రికలు మరియు న్యూస్ చానెళ్లు ఎలా వ్యవహరిస్తాయో తెలీదు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియా చానెళ్లు కోసం మాత్రం ఏ మాత్రం రాజకీయ అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికీ తెలుసు.మన దగ్గర ఉన్న కొన్ని చానెళ్లు పైకి ప్రజల కోసమే వారు పని చేస్తున్నాం ప్రజాస్వామం కాపాడడం కోసమే తాము మీడియాను నడుపుతున్నామని చెప్తూనే వారి సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధంగా కేవలం ఒకరికి మాత్రమే కొమ్ము కాస్తారు.వీరిలో కొన్ని రకాలు కూడా ఉన్నారు.డబ్బులకు అమ్ముడుపోయే వారు,అలాగే అధికారంలో ఎవరు ఉంటే వారికి వత్తాసు పలికే వారు.

ఇలా మన దగ్గర మీడియా ఛానెళ్ల వారు ఉన్నారు.గతంలో చంద్రబాబుకి భజన చేసిన చానెళ్లు అంతా ఇప్పుడు జగన్ కు భజన చేస్తున్నాయా అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఇచ్చిన గట్టి వార్నింగ్ ప్రభావమో ఏమో ఇప్పుడు మెల్లగా జగన్ ను పైకి లేపుతూ మిగతా పార్టీల వారిని కాస్త దిగదిడుపుగా వార్తలు చిత్రీకరిస్తున్నారు.జగన్ వైపు నుంచి కాస్త సాఫ్ట్ కార్నర్ వచ్చేలా చూసుకుంటూ జగన్ కు పాజిటివ్ గా వార్తలు వేస్తున్నారు.దీనితో ఇప్పుడు జగన్ భజన చెయ్యడం మొదలు పెట్టారని రాజకీయ వర్గాల్లో ప్రజానీకం మాట్లాడుకుంటున్నారు.