ఎన్‌పీఎస్ ప్రోమో.. బ‌న్ని అట్టుడికించాడుపో!

Tuesday, May 1st, 2018, 12:52:59 AM IST

“అట్ట సూడ‌కే.. కొట్టిన‌ట్టుగా అట్ట సూడ‌కే… సిట్టిగుండెకే.. గురిపెట్ట‌కె తుపాకి.. “ … `నా పేరు సూర్య‌`లోని బిట్ ప్రోమో ఇది. కేవ‌లం కొన్ని సెక‌న్ల ప్రోమోలో బన్ని స్టెప్పులు ఇర‌గ‌దీశాడంటే అతిశ‌యోక్తి కానేకాదు. త‌న ప్ర‌తి సినిమాలో ఏదో ఒక‌ పాటలో ల్యాండ్ మార్క్ స్టెప్పులు ఉండాల‌ని కోరుకునే బ‌న్ని ఈ పాట‌లో అద‌ర‌గొట్టేశాడు. కోసం బ‌న్ని ప‌డిన శ్ర‌మ విజువల్స్‌లో క‌నిపిస్తోంది. సాంకేతికంగానూ ఈ పాట విజువ‌ల్ ఫీస్ట్‌గా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

ఈ పాట‌లో అనూ అందచందాలు కిక్కెక్కిస్తున్నాయి. ఎన్‌పీఎస్ టెక్నిక‌ల్ టీమ్ ప్రోమోని వెబ్ లో రిలీజ్ చేసిందో లేదో అలా బ‌న్ని ఫ్యాన్స్‌లో జోరుగా వైర‌ల్ అయిపోయింది అంటే బ‌న్నికి ఉన్న క్రేజును అర్థం చేసుకోవాలి. నా పేరు సూర్య‌కు విశాల్ – శేఖ‌ర్‌ ఎన‌ర్జిటిక్ మ్యూజిక్ సంథింగ్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌. ఇక‌పోతే ఈ సినిమాని మే 4న అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ చేసేందుకు చిత్ర‌యూనిట్ స‌న్నాహ‌కాల్లో ఉంది. మే 3న భారీగా వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్ల‌కు స‌న్నాహాలు సాగుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments