ఈ ఫ‌లితం బాస్ ముందే ఊహించారు!

Tuesday, May 15th, 2018, 09:20:46 AM IST

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో రెండు విష‌యాలు ప్ర‌త్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అస‌లు ఎలాంటి క‌మ‌ర్షియ‌ల్ అంశాలు లేకుండా `మ‌హాన‌టి` విజ‌యం సాధించ‌డం… రెండోది అన్ని క‌మ‌ర్షియ‌ల్ విలువ‌లు ఉండీ `నా పేరు సూర్య‌` ఫ్లాప‌వ్వ‌డం.. అయితే ఎన్‌పీఎస్ ప‌రాజ‌యానికి బ‌న్ని& వ‌క్కంతం టీమ్ పూర్తిగా బాధ్య‌త వ‌హిస్తోంది. వాస్త‌వానికి ఈ సినిమా ఎలా ఉంది? అన్న చ‌ర్చ ఎడిటింగ్ టేబుల్‌పై ముందే సాగిందిట‌. అక్క‌డ బాస్ అల్లు అర‌వింద్ త‌న మ‌న‌సులో ఏం ఉందో ముందే క్లియ‌ర్‌క‌ట్‌గా తేల్చి చెప్పార‌ట‌.

`నా పేరు సూర్య‌` ఎడిటింగ్ టేబుల్‌పై ఉన్న‌ప్పుడే ఈ సినిమా ద్వితీయార్థం అంత బాలేద‌ని, కొన్ని స‌న్నివేశాల్ని ట్రిమ్ చేయాల‌ని అర‌వింద్ సూచించార‌ట‌. కానీ వ‌క్కంతం విజ‌న్ ప్ర‌కార‌మే చేద్దామ‌ని బ‌న్ని, నిర్మాత బ‌న్ని వాస్ అత‌డినే అనుస‌రించారు. అయితే సంద‌ర్భం ఏదైనా… స్క్రిప్టు డాక్ట‌ర్ అర‌వింద్ చెప్పింది వింటే ఫ‌లితం వేరేలా ఉండేదేమో? అన్నచ‌ర్చ‌ సాగుతోంది. ఎన్‌పీఎస్ ప‌రాజ‌యంతో విక్ర‌మ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని చేయాల్సిన సినిమా హోల్డ్‌లో ఉంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌యోగాలు చేయ‌డం త‌గ‌ద‌ని అర‌వింద్ సూచించార‌ట‌. `మ‌నం`, `24` లాంటి క్లాసిక్ సినిమాలు తీసిన విక్ర‌మ్‌.కె ఈసారి బ‌న్నికి ఎలాంటి స్క్రిప్టు వినిపించారో తెలియాల్సి ఉంది. ఇక‌పోతే ఎలాంటి ప్ర‌యోగం అయినా ఎమోష‌న్‌ని పండించ‌గ‌లిగితే విజ‌యం ద‌క్కుతుంద‌ని ప‌లు ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు నిరూపించాయి. మ‌రి విక్ర‌మ్‌.కెతో బ‌న్ని ముందుకు వెళ‌తాడా? లేదా? అన్న‌ది వేచి చూడాలి.

Comments