‘గీత’పై ఒట్టేసిన ఆస్ట్రేలియన్ ఎంపీ!

Tuesday, May 12th, 2015, 04:40:15 PM IST


ఆస్ట్రేలియాలో న్యూసౌత్ వేల్స్ కు చెందిన లేబర్ పార్టీ నేత డానియల్ మూఖీ హిందువుల పవిత్ర గ్రంధం ‘భగవద్గీత’పై ప్రమాణం చేసి ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. కాగా 32ఏళ్ళ మూఖీ తల్లితండ్రులు అతను పుట్టకు ముందే భారత్ లోని పంజాబ్ ప్రాంతం నుండి వలస వచ్చి ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. ఈ నేపధ్యంగా మూఖీ తన ప్రమాణ స్వీకారానికి పవిత్రమైన భగవద్గీతను ఎంచుకున్నారు.

ఇక బ్లాక్ టౌన్ లో పుట్టిన మూఖీ విద్యార్ధి దశ నుండే రాజకీయాలపై అమితాశాక్తిని కనబరిచేవారు. కాగా తన ప్రమాణస్వీకారంపై మూఖీ మాట్లాడుతూ భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి ఆస్ట్రేలియా రాజకీయనేతను అయినందుకు ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే ఈ చారిత్రక ప్రమాణ స్వీకారం సందర్భంగా కాస్త ఒత్తిడికి లోనయ్యానని మూఖీ పేర్కొన్నారు. ఇక భగవద్గీత గొప్ప మతపరమైన గ్రంధాలలో ఒకటని బైబిల్, ఖురాన్, తోరా లాగే అది గర్వించదగ్గ గ్రంథమని మూఖీ గీత వైశిష్ట్యాన్ని వివరించారు.