18కోట్ల‌కు ఎన్టీఆర్28 ఓవ‌ర్సీస్‌

Friday, May 18th, 2018, 04:17:12 PM IST

ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్- హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ఫ్యాక్ష‌న్ యాక్ష‌న్ చిత్ర‌మిద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే తార‌క్‌కి ఉన్న ట్రాక్ రికార్డ్ దృష్ట్యా, హారిక అధినేత రాధాకృష్ణ‌కు ఉన్న మొబిలిటీ కెపాసిటీ వ‌ల్ల ఈ సినిమాకి ట్రేడ్‌లో అద్భుత‌మైన డిమాండ్ ఏర్ప‌డిందిట‌.

ఎన్టీఆర్ 28 ప్రీరిలీజ్ బిజినెస్ లోక‌ల్‌గా, ఓవ‌ర్సీస్‌లో పూర్త‌వుతోంద‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమా స‌హా నాగ‌చైత‌న్య‌- మారుతి `శైల‌జా రెడ్డి అల్లుడు`, శ‌ర్వానంద్ – సుధీర్ వ‌ర్మ తాజా సినిమాల్ని క‌లిపి రాధాకృష్ణ ఓవ‌రాల్‌గా బిజినెస్ మాట్లాడార‌ని తెలుస్తోంది. తార‌క్ సినిమా కోసం ఓవ‌ర్సీస్ పంపిణీదారు ఏకంగా 18కోట్లు చెల్లిస్తున్నార‌ని తెలిసింది. వాస్త‌వానికి త్రివిక్ర‌మ్ గ‌త చిత్రం `అజ్ఞాత‌వాసి` డిజాస్ట‌ర్ ఫ‌లితం అందుకున్నా ఆ ఫ‌లితం తార‌క్‌పై ప‌డ‌క‌పోవ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అజ్ఞాత‌వాసి న‌ష్టాల్లో 20శాతం భ‌రించేందుకు రాధాకృష్ణ భ‌రోసా ఇవ్వ‌డం తాజా బిజినెస్‌కి సాయ‌మైందిట‌. తార‌క్‌కి బ్లాక్‌బ‌స్ట‌ర్ ట్రాక్‌రికార్డ్… క‌లిసొస్తోంది. ఓవ‌ర్సీస్‌లో సునాయాసంగా 3 మిలియ‌న్ డాల‌ర్ వ‌సూలు చేసే స‌త్తా ఉన్న స్టార్‌గా తార‌క్‌కి గుర్తింపు ఉంది. ఎన్టీఆర్ న‌టించిన `నాన్న‌కు ప్రేమ‌తో`, `జ‌న‌తా గ్యారేజ్‌` చిత్రాలు ఓవ‌ర్సీస్‌లో చ‌క్క‌ని వ‌సూళ్లు సాధించాయి. ఆ క్ర‌మంలోనే తార‌క్ 28వ సినిమాకి ఇంత పెద్ద బిజినెస్ జ‌రిగింద‌ని చెబుతున్నారు.